జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిన్నారి స్కందన్ కార్తికేయ పేరు నమోదు చేయడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు.
గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి అయిన బి.శాంతి w/o హేమంత్ కుమార్ కుమారుడు 4 నెలల 19 రోజుల చిన్నారి ఎస్.కె. స్కందన్ కార్తికేయ ఫ్లాష్ కార్డ్‌లను (వెజిటబుల్స్, కలర్స్, అనిమల్స్, ఫ్రూట్స్, బర్డ్స్, వెహికల్స్, షేప్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, లాంటివి) గుర్తించడంలో అతి చిన్న వయస్సు చిన్నారిగా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసింది. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో చిన్నారి స్కందన్ కార్తికేయతో కలిసి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ ని కలిశారు. చిన్నారిని గుడ్ అంటూ జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారిని సాధారణ అబ్బాయిలా పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. భవిష్యత్తులో కూడా చిన్నారికి ప్రోత్సాహం అందించాలన్నారు. చిన్నారి తల్లితండ్రులు మాట్లాడుతూ 244 ఫ్లాష్ కార్డ్‌లను గుర్తించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిన్నారి స్కందన్ కార్తికేయ పేరు నమోదు చేశారన్నారు. ఈనెల 18వ తేదీన నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేషన్ రావడం జరిగిందని తెలిపారు. తమ చిన్నారిని అభినందించడం పట్ల జిల్లా కలెక్టర్ కి వారు కృతజ్ఞతలు తెలియజేశారు…