London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 19, 2024
Saturday, October 19, 2024

ఇజ్రాయిల్‌పై ప్రతీకారం మా బాధ్యత: ఇరాన్‌

టెహ్రాన్‌: హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హానియే హత్యతో ఇజ్రాయిల్‌పై ప్రతీకారానికి ఇరాన్‌ సిద్ధమైంది. టెల్‌ అవీవ్‌పై నేరుగా దాడికి ఇరాన్‌ నాయకుడు ఆయాతుల్లా ఖమేనీ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రివల్యూషనరీ గార్డ్స్‌ వర్గాలు తెలిపినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదించింది. ఇస్మాయిల్‌ హత్య జరిగిన కొన్ని గంటల్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. ఇరాన్‌ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వచ్చిన ఇస్మాయిల్‌పై ఆయన నివాసం వద్ద దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన బాడీగార్డ్‌ కూడా హతమయ్యారు. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు తాము చేసే దాడి తీవ్రత ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో యెమెన్‌, సిరియా సహా మిత్రదేశాల దళాలను సమన్వయం చేసుకునే పనిలో ఇరాన్‌ ఉన్నట్లు న్యూయార్క్‌ కథనం తెలిపింది. ఇజ్రాయిల్‌పై దాడి చేసే క్రమంలో ప్రతిదాడులకు సిద్ధంగా ఉండాలని రివల్యూషనరీ గార్డ్స్‌తో పాటు సైన్యానికి ఖమేనీ సూచనలు చేసినట్లు వెల్లడిరచింది. టెల్‌ అవీవ్‌, హైఫా సమీపంలోని సైనిక లక్ష్యాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసే యోచనలో ఇరాన్‌ ఉన్నట్లు పేర్కొంది. హమాస్‌ చీఫ్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం తన బాధ్యతగా ఖమేనీ పేర్కొన్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. తమ దేశంలో ఈ హత్య జరగడాన్ని మరింత తీవ్రంగా పరిగణిస్తోందని, ఇజ్రాయిల్‌ను కఠినంగా శిక్షాలని భావిస్తోందని వార్తాకథనం పేర్కొంది. ఇస్మాయిల్‌ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయిల్‌పై దాడి చేస్తామని ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌, విదేశాంగ శాఖ, ఐరాసలోని ఇరాన్‌ మిషన్‌ కూడా ప్రకటించాయి.
లెబనాన్‌లో ఇరాన్‌ సైనిక సలహాదారు హత్య
లెబనాన్‌ రాజధాని బీరుట్‌ శివార్లలో ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో ఇరాన్‌ సైనిక సలహాదారు మీలాద్‌ బిదీ హతమయ్యారు. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన ఫార్స్‌ వార్తాసంస్థ వెల్లడిరచింది. హెజ్బుల్లా అగ్ర సైనిక కమాండర్‌ ఫౌద్‌ షోఖర్‌ ఉన్న దహియే శివార్లలోని భవనంపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో మీలాద్‌ హతమైనట్లు వార్తానివేదిక పేర్కొంది. ఆయనను గుర్తించడం ఆలశ్యమైన క్రమంలో మరణాన్ని ప్రకటించడంలో జాప్యం జరిగినట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img