London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Wednesday, October 23, 2024
Wednesday, October 23, 2024

సంతాన పరిమితి ఎత్తివేత

. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు మించినా పోటీ
. క్యూ ఆర్‌ కోడ్‌, రాజముద్రతో పాస్‌ పుస్తకాలు
. కొత్త మద్యం విధానంపై సబ్‌ కమిటీ
. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: స్థానిక సంస్థలకు పోటీపడే అభ్యర్థులకు ఇదొక శుభవార్త. ఇకపై ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రానుంది. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయాలంటే ఇద్దరికి మించి పిల్లలుండరాదు. ఒకవేళ నామినేషన్‌లో పొందుపర్చకుండా ఉన్నా, ఆ తర్వాత వాటిలో సభ్యులుగా కొనసాగరాదు. ఇద్దరు పిల్లలకు మించిన ఈ సంతాన నిషేధంపై ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1955, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాల్టీస్‌ చట్టం 1965లో చేసిన చట్ట సవరణల రద్దు కోసం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టం – 1994లోని సెక్షన్‌ 19కు చేసిన సవరణను రద్దుకు చేసిన ప్రతిపాదనలకు కూడా మంత్రిమండలి ఆమోదం లభించింది. తగ్గుతున్న పునరుత్పత్తి రేటును పరిగణలోకి తీసుకుంటూ… మారుతున్న సామాజిక, ఆర్థిక అవసరాలను, జనాభా స్థిరీకరణ, జనాభా సమతౌల్యతను దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనలు ప్రస్తుత పరిస్థితులకు వర్తించనందున ఆ చట్టసవరణల రద్దుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వెల్లడిరచారు. జాతీయ పునరుత్పత్తి రేటు 2.1 గా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అది కేవలం 1.5గా ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల పునరుత్పత్తి వయసు సగటున 32.5 కాగా 2047 నాటికి 40 ఏళ్లుకానుంది. అదేవిధంగా మహిళల్లో ప్రస్తుత పునరుత్పత్తి వయస్సు సగటున 29 సంవత్సరాలు కాగా అది 2047 నాటికి 38 సంవత్సరాలు కానుంది. ఆర్థికాభివృద్ధికి దోహదపడే వ్యక్తుల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. అదేవిధంగా ప్రస్తుతం ఏపీలో 60 ఏళ్లకు పైబడిన వ్యక్తుల సంఖ్య 11 శాతం కాగా, ఇది 2047 నాటికి 19 శాతం కానుంది. ఇదే వయస్సు జాతీయస్థాయిలో ప్రస్తుతం 10 శాతంగా ఉండగా, 2047 నాటికి 15 శాతం కానుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని పట్టణ స్థానిక సంస్థల్లో అనర్హులుగా ప్రకటిస్తూ 1955, 1965, 1994లో వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ చట్టాలకు సవరణల ద్వారా కుటుంబ నియంత్రణ ప్రోత్సహించేలా జత చేసిన నిబంధనలను రద్దు చేసే ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడిరచారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ – 1992, సెక్షన్‌ 3 ప్రకారం (ఎ) కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మావోయిస్టు), రివల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఆర్‌డీఎఫ్‌) సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని మంత్రివర్గం తీర్మానించింది.
మూడు దశాబ్దాలుగా మత్స్యకార సంపద, సంక్షేమం కోసం నామమాత్రపు లీజుతో ప్రభుత్వ చెరువులను మత్స్యకార సహకార సంఘాలకు కేటాయిస్తున్నారు. కానీ గత ప్రభుత్వం మత్స్యకారుల హక్కులకు భంగం కలిగించేలా జారీ చేసిన జీవో 144, 217లను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. చేప పిల్లల పెంపకం నుండి మార్కెటింగ్‌ వరకు దళారీ వ్యవస్థ లేకుండా మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి తెలిపారు. పర్యాటక అభివృద్ధి కోణంలో కూడా ఆలోచించాలని, తద్వారా ఉపాధి, ఆర్థిక ప్రగతి కలుగుతాయని పేర్కొన్నారు. మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి, జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా తరువాతి కేబినెట్‌కు ఆ ప్రణాళిక అందించాలని సూచించారు. దీంతో 27 మత్స్యకార సంఘాలకు మేలు కలిగించాలని, వీటిపై ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే సదుద్దేశంతో సంబంధిత జీవోలు రద్దు చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలియజేసింది. మొదటి దశ కింద నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా 380 పోస్టుల భర్తీ చేపట్టాలని, రెండవ దశ కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ కోర్సును ప్రారంభించాలని మండలి నిర్ణయించింది. 2014-19తో పోలిస్తే ప్రస్తుత మద్యం పాలసీ లోపభూయిష్టంగా ఉందని, పర్యవేక్షణలో అంతరాలు, విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు, ఆదాయ నష్టాల పెరుగుదలకు దారితీసినందున అక్టోబరు 1 నుంచి కొత్త విధానం అమల్లోకి తెచ్చేందుకు ఎక్సైజ్‌ శాఖ తాజా ప్రతిపాదనలను అధ్యయనం చేయడానికి కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తూ కేబినెట్‌ తీర్మానించింది. రూ.22.95 కోట్ల వ్యయంతో జారీచేసిన 21.86 లక్షల భూహక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర, క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.
రెవెన్యూ శాఖలో 22ఏ నిషేధిత జాబితాకు సంబంధించి ఫిర్యాదుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్‌కు సూచించారు. రాబోయే మూడు నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్లు నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారధి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img