విశాలాంధ్ర -ధర్మవరం:: గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు తల్లం నారాయణమూర్తి, డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో నీ కొత్తపేటలో అర్బన్ హెల్త్ సెంటర్ నందు 50 మంది గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా దాతల సహాయ సహకారములతో వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం మాకెంతో సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వారు తెలిపారు. నేటి దాతగా సంస్థ అధ్యక్షులు కల్లం నారాయణమూర్తి నిర్వహించడం శుభదాయకమని తెలిపారు. వైద్యులు చెప్పిన ప్రకారం ప్రతి నెల వైద్య చికిత్సలు చేసుకోవాలని, సుఖవంతమైన ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలోనే వెళ్లాలని వారు సూచించారు. ప్రశాంతమైన జీవితం కొనసాగించాలంటే ఆందోళన కలిగించే విషయాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి చిన్నప్ప, సంయుక్త కార్యదర్శి మంజునాథ్, వేణుగోపాల్, మనోహర్ గుప్తా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.