Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

దసరా పండుగ..తెలుగు రాష్ట్రాలకు 644 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

దసరా పండుగ సెలవులతో నగరంలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో నిలబడి వెళ్లేందుకూ చోటు ఉండని పరిస్థితి ఏర్పడింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ అలర్ట్ అయ్యింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్దమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్ నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే నుంచి 170 రైళ్లు, ఇతర ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే మీదుగా 115 రైళ్లు నడపనున్నారు. మరో 185 రైళ్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రూట్లను కూడా ప్రకటించారు. సికింద్రాబాద్-కాకినాడ, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-నగర్ సోల్, సికింద్రాబాద్-మడ్లాటౌన్, సికింద్రాబాద్-సుబేదార్ గంజ్, హైదరాబాద్-గోరఖ్‌పూర్, మహబూబ్‌నగర్-గోరఖ్‌పూర్, సికింద్రాబాద్-దానాపూర్, సికింద్రాబాద్-రాక్సల్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ , సికింద్రాబాద్ – విశాఖపట్నం ఉన్నాయి. సికింద్రాబాద్-సంత్రాగచ్చి, తిరుపతి-మచిలీపట్నం, తిరుపతి-అకోలా, తిరుపతి-పూర్ణ, తిరుపతి-హిసార్, నాందేడ్-ఈరోడ్, జాల్నా-చాప్రా, తిరుపతి-షిర్డీ తదితర ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img