విశాలాంధ్ర-అనంతపురం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగ్ ఆనంద్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని మైనారిటీ వింగ్(సిపిఐ )ఇన్సాఫ్ గౌరవ అధ్యక్షులు అల్లి పీర,మైనారిటీ వింగ్ నగర ప్రధాన కార్యదర్శి(సి పి ఐ )సూఫీ ఖాజా హుస్సేన్ అనంతపురం డీస్పీ శ్రీనివాస్ రావు ని కలిసి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సూఫీ ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ… బీహార్ కు చెందిన యతి నర్సింగ్ ఆనంద్ ముస్లిం మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దేశవ్యాప్తంగా, రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయి వరకు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. అనంత జిల్లా నుంచి స్థానిక డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి శ్రీనివాసులు కలిసి ఆనంద్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వినతి పత్రం ద్వారా కోరడం జరిగిందన్నారు. ఈ విషయంపై డీస్పీ సానుకూలంగా స్పందించారన్నారు.