విశాలాంధ్ర-శింగనమల : పోలీసులు రాత్రి గస్తీలో భాగంగా గార్లదిన్నె రోడ్డుకు స సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య తన సిబ్బందితో వాహనంలో వెళ్తుండగా చిన్న జలాలపురం గ్రామం దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బొలెరో వాహనం లో ఎనిమిది గొర్రెలను అపహరించుకొని పోతూ ఉండగా, సర్కిల్ ఇన్స్పెక్టర్ వాహనం సైరన్ విని ఆ గొర్రెలను చిన్న జలాలపురం గ్రామం సమీపంలో సుమారు అర్థరాత్రి 2:30 గంటల సమయంలో వదిలి పారిపోయినారని గొర్రెలను శింగనమల పోలీస్ స్టేషన్ కు తరలించినామని, గొర్రెలు పోగొట్టుకున్న వారు ఎవరైనా యజమానులు తగిన ఆధారాలను తీసుకొని శింగనమల పోలీస్ స్టేషన్ కు రావాలని తెలియజేశారు,