Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఘనంగా చంద్రబాబు 75 వ జన్మదిన వేడుకలు

తెదేపా నాయకులు ఆనంద్, నాగభూషణం, లక్ష్మణ్

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలను చింతపల్లిలో ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్, అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం, మండల ఉపాధ్యక్షుడు ఆండ్రాబు లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా చంద్రబాబు చిత్రపటానికి పూలు, పాలాభిషేకం చేశారు, అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75 ఏళ్ల జీవితంలో 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషిచేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ తమ్మంగుల ఎంపీటీసీ సభ్యుడు అప్పారావు, బలపం మాజీ సర్పంచ్ గబులంగి అప్పారావు. నాయకులు వెలుసూరి సోమయ్య, భీమన్న, అప్పారావు, గేమ్మేల రమణ, అధిక సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img