Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

పార్టీ ఇంచార్జ్ ప్రమేయం లేకుండా నూతన కమిటీలను ప్రకటించే అధికారం ఎవరిచ్చారు?

తెదేపా మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తెదేపా పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రమేయం లేకుండా ఆ పార్టీలో పాత కమిటీలను రద్దుచేసి నూతన కమిటీలను ఏర్పాటు చేసే హక్కు సభ్యత్వాలు లేని నాయకులకు ఎవరిచ్చారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు అన్నారు. గడచిన ఐదేళ్లుగా అధికార వైకాపా ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ మన్య ప్రాంతంలో తెదేపాను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేసిన పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి తో పాటు నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జి లు, కుటుంబ సాదికార సారథులకు, ఓటర్లకు పరిచయమే లేని వ్యక్తిని పాడేరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టాన నిర్ణయాన్ని నిరసిస్తున్న పార్టీ కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు విరుద్ధంగా పాడేరు శాసనసభ అభ్యర్థిత్వం దక్కించుకున్న వ్యక్తితో పాటు కొందరు నాయకులు ప్రస్తుతం పాడేరు నియోజకవర్గంలో ఉన్న తెదేపా పాత మండల కమిటీ లను రద్దు చేయాలని, నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని ఒక దురభిప్రాయం తో ఉండడమే గాక ఈమధ్య నూతన కమిటీని ప్రకటించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఎన్నికలు నోటిఫికేషన్ వెలువడిన ఈ సమయంలో ఏ పార్టీ కూడా ఇటువంటి చిల్లర పనులు చేయరని, రాజకీయ అవగాహన లేని వారే ఇటువంటి చర్యలు చేపడతారని భావిస్తున్నామన్నారు. అనివార్య కారణాల రీత్యా మార్పు చేయాలన్నా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అనుమతి ఉండాలని, ప్రస్తుతం పాడేరు నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ గా గిడ్డి ఈశ్వరి గారే కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఆమెతో సంప్రదింపులు జరపుకుండా నూతన కమిటీని ఎలా ప్రకటించారనేది ప్రకటించిన వారే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఏదైతే నూతన కమిటీల నియామకాలకి తెరలేపారో వారు ప్రత్యర్థి పార్టీలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని తెదేపా లో కమిటీల పేరిట చీలికలు తెచ్చి ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూర్చే ఆలోచన చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. తెదేపా పాడేరు నియోజకవర్గం కుటుంబ సభ్యులందరూ ఈ పరిణామాలను గమనించాలన్నారు. గడచిన ఐదేళ్లుగా పార్టీ ని కాపాడిన మనల్ని ఈ రోజు క్రొత్త గా పార్టీ లో చేరిన వ్యక్తులు బెదిరించటం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నానన్నారు. ఇన్చార్జిగా ఉన్న గిడ్డి ఈశ్వరి ని అదిష్టానం పిలిచి మాట్లాడే వరకూ సామంతా గిడ్డి ఈశ్వరి వెంటే నడుస్తామని, పార్టీ శ్రేణులతో పాటు నాయకులు కార్యకర్తలు ఓటర్లను ఆమె వెంటే నడిపిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. కార్యకర్తలను ఓటర్లు ను నడిపిస్తాము.ఇందులో ఎటువంటి మార్పు ఉండదని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img