Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

బెల్లం ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్ ….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని లక్ష్మి పురం గ్రామంలో జాగృతి సొసైటీ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో నిర్వహించిన మైక్రో ఎంటర్ ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం క్రింద విలువ ఆధారిత ఉత్పత్తుల పై ఈ నెల 15 నుండి 30 వరకు 15 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి జి.సుమంత్ కుమార్ ప్రారంభించారు. సిద్ది ఫల రైతు ఉత్పత్తి దారుల కల్లెక్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా రూరల్ అగ్రికల్చర్ రీసెర్చ్ కేంద్రం (ఆర్.ఏ.ఆర్.ఎస్) ఏ.డి.ఆర్. పి.వి.జగన్నాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బెల్లం ఆధారిత ఉత్పత్తులకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, దీనికి గల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగం అందిపుచ్చు కోవాలన్నారు. జాగృతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. సుజాత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వగల ఉపాధి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్థ కన్సల్టెంట్ వి.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమ0లో 20 రకాల విలువ ఆధారిత బెల్లం ఉత్పత్తులపై శిక్షణ ఇచ్చి, వారు వ్యక్తిగతంగా వ్యాపారం చేసుకొనుటకు బ్యాంక్ ద్వారా రుణాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ది ఫల ఎఫ్.పి.ఓ. ఛైర్మన్ వీరునాయుడు, సి.ఈ.ఒ. సిమ్మి నాయుడు, డైరక్టర్ బి.నారాయణ రావు, సిబ్బంది, రైతాంగం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img