Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

చేనేతకు జీఎస్టీని మినహాయింపు చేస్తాం..

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వర్థ నారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగాన అశ్వర్థ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా పట్టణంలోని గాంధీ నగర్ మెయిన్ బజార్, శ్రీదేవి థియేటర్ రోడ్డు వరకు గల ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. అదేవిధంగా చిన్నా, పెద్దా వ్యాపారస్తులకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను తెలుపుతూ, కర్ణాటక, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కు రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు తప్పక అందజేస్తారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను తప్పక అమలు చేసి తీరుతామని తెలిపారు. చేనేతకు జీఎస్టీని మినహాయింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సి ఏ ఏ, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్, యు సి సి చట్టాలను రద్దు చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు, రైతు పెట్టుబడి మీద 50 శాతము లాభంతో మద్దతు ధర, ఉపాధి హామీ కూలీకి రోజుకు కనీసం 400 రూపాయలు వేతనము, వృద్ధులకు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, వికలాంగులకు 6000రూ .పెన్షన్ ఇవ్వబడుతుందని తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు గ్యారంటీతో తదితర పథకాలను వెనువెంటనే అమలు చేస్తామని చేనేత వ్యాపారులు కార్మికుల సంక్షేమానికి చేనేత బ్యాంకు ఏర్పాటు చేస్తామని, పట్టు ముడి సరుకు కొనుగోలుకు 40 శాతం రాయితీ ఇస్తామని, చేనేత ప్రాంతాలలో ప్రభుత్వ సహకారంతో ముడి సరుకు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో మాదిరిగా ఆంధ్ర సిల్క్స్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని ఆత్మహత్యలు చేసుకున్న నేతలను తగిన ఆర్థిక సహాయంతో ఆదుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు తాహీర్, నారాయణస్వామి, మునఫ్,జాఫర్, కరీం, సాయి, శంకర్, రాజు, మన్సూర్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img