Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ

విశాలాంధ్ర`ఉరవకొండ : సెపక్తక్రా జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు జిల్లా సెపక్తక్రా సంఘం చైర్మన్‌ సప్తగిరి మల్లికార్జున క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక వీరశైవ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులు ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా జట్టు ఈనెల 12 నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు గణేష్‌ బాబు, సి నాగేశ్వరరావు, బాలచంద్ర, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మమత, లెక్చరర్‌ ప్రసాద్‌ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img