Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

చిరుత దాడిలో వ్యక్తి మృతి?

విశాలాంధ్ర` కళ్యాణదుర్గం టౌన్‌ : చిరుత దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని కామక్క పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు అట్టివిశాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు తెల్లవారుజామున తన వ్యవసాయ పొలంకు వెళుతుండగా అకస్మాత్తుగా చిరుత దాడి చేసేందుకు ప్రయత్నించిందని భయానికి గురై గుండెపోటు వచ్చి మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకు నిదర్శనం మృతుడు రామాంజనేయులు పై చిన్నపాటి గాయాలు ఉండటంతో చిరుత దాడి చేసిందని అటవీ శాఖ అధికారులు కూడా చిరుత దాడి అయి ఉండొచ్చు అన్నారు. ఆ గ్రామం చుట్టూ గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తూ ఉందని పనుల నిమిత్తం పోవాలంటే భయంతోనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనేది అన్నారు. ఘటనా స్థలానికి అటవీశాఖ అధికారులు గ్రామస్తులతో వెళ్లి పరిశీలించారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img