test
Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

డ్రైనేజి నిర్మాణ పనులు పరిశీలన

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ పట్టణ శివారులోని లత్తవరం రోడ్డులో జరుగుతున్న సైడ్ వాల్, డ్రైనేజి పనులను శనివారం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా ప్రతినిధులు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కృషితో నిర్మిస్తున్న ఈ పనులు పూర్తి అవుతే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్నారు భగవాన్ రిక్రియేషన్ క్లబ్ సమీపం నుంచి సమ్మన కుంట వరకు డ్రైనేజి, సైడ్ వాల్ నిర్మాణపు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత, ఎంపీపీ చంద్రమ్మ, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందు, పిఏసీఎస్ చైర్మన్ షేక్షావలి,డైరెక్టర్ బ్యాళ్ల ప్రసాద్, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, పార్టీ పంచాయతీ రాజ్ అధ్యక్షుడు బసవరాజు, నాయకులు ఓబన్న, పచ్చి రవి, వేమన్న వడ్ల సలీం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img