Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

పేద విద్యార్థులకు కళాశాల సమయానికి బస్సులు ఏర్పాటు చేయాలి

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు హనుమంతరాయుడు
విశాలాంధ్ర`కళ్యాణదుర్గం టౌన్‌ : విద్యార్థిని విద్యార్థులు బస్సుల కోసం నానా అవస్థలు పడుతున్నారని డిఎం గారు స్పందించి సమయానికి బస్సులు నడపాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. గురువారం విద్యార్థులతో కలిసి ఆర్టీసీ డిపో ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి
ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు హనుమంతరాయుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి కళ్యాణదుర్గం పట్టణంలో చదువుతున్న విద్యార్థులకు సరైన సమయానికి బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కళాశాల సమయానికి బస్సులు నడపాలని కళ్యాణదుర్గం డిపో ముందు ఏఐఎస్‌ఎఫ్‌, ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా నేమకల్లు, బొమ్మనహల్‌, ఉంతకల్‌, క్రాస్‌, దేవగిరి క్రాస్‌, ఉద్దేహళ్‌, రంగాపురం, ఉప్రాహల్‌ ,ఎల్బీనగర్‌, గోనెహళ్‌ ,గనిగేర, ఎర్రగుంట, కనేకల్‌, క్రాస్‌ పుల్లంపల్లి ,పూలచర్ల క్రాస్‌, గోపులాపురం ,నాగిరెడ్డిపల్లి, వేపురాళ్ల ,గుండ్లపల్లి క్రాస్‌ ,ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి కళ్యాణదుర్గం వచ్చే విద్యార్థులు 150 మంది విద్యార్థులు వస్తున్నారు. కళాశాల సమయానికి బడి బస్సు లేక అక్కడి నుంచి వచ్చే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు మాకు కళాశాల సమయానిక బడి బస్సులు ఏర్పాటు చేయాలని డిఎం గారిని అడగగా అక్కడున్న ఆర్టీసీ డిఎం విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సమితి నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతే కాకుండా గతంలో డీఎంలు విద్యార్థులకు బడి బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న డిఎం మాత్రం ఉండే బడి బస్సులను నడపకుండా కళ్యాణదుర్గం టూ అనంతపురం కు నడపడం జరుగుతుంది ప్రత్యేకించి విద్యార్థుల కోసం వేసినటువంటి బడి బస్‌ లు యధావిధిగా నడపాలి. కావున నేమకల్లు టు కళ్యాణదుర్గం విద్యార్థులకు బడి బస్సు నడపాలని ధర్నా చేయడం జరిగింది.ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే తీర్చాలని ఏఐఎస్‌ఎఫ్‌, గా డిమాండ్‌ చేయడం జరిగింది. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్‌ఎఫ్‌, ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడతమని హెచ్చరించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ తాలూకా ఉపాధ్యక్షుడు నవీన్‌ కుమార్‌, అక్షిత్‌ ,క్రాంతి, కంబదూరు మండలం అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్‌, నితీష్‌, నాయకులు సుధాకర్‌, చిన్న, చంద్రశేఖర్‌, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img