Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రత్యేక అవసరాల పిల్లలు భగవత్‌ స్వరూపులు…

పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల డి.ఎస్‌.పి మల్లికార్జున వర్మ
విశాలాంధ్ర` ధర్మవరం : ప్రత్యేక అవసరాల పిల్లలు అనంతపురం పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల డిఎస్పి మల్లికార్జున వర్మ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం అనూత నెట్వర్క్‌ సంస్థ సౌజన్యంతో ఎన్కెసి సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణములోని ఎల్సికేపురంలో గల భవిత ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలోని విద్యార్థులకు విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు. అనంతరం డిఎస్పీ మల్లికార్జున వర్మ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పాఠశాలలోని విద్యార్థులను తీర్చిదిద్దడం ఒక సవాల్‌ లాంటిదని, వారి పట్ల జాలి చూపడం కాకుండా, ప్రేమ పూరకంగా వ్యవహరించినప్పుడే మానవతా విలువలు పెరుగుతాయని తెలిపారు. ఇటువంటి పాఠశాలకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతో అవసరం ఉందని, అంతేకాకుండా అనూత నెట్వర్క్‌ ఎన్‌ కే సి సేవా సమితి సంస్థలు తమ వంతుగా సహాయం చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్కేసి సేవాసమితి వ్యవస్థాపకులు కమల నాథ్‌, సభ్యులు జీవీ రమణ, నవీన్‌, పాఠశాల ఉపాధ్యాయురాలు ఆరిఫా, ఫైట్‌ ఫర్‌ రైట్స్‌ సంస్థ అధ్యక్షుడు కేపీ రాజు, తోట నాగరాజు, సుంకర రమేష్‌, సుధాకర్‌, మంజునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img