Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

ప్రభుత్వ అధికారుల అనుమతి లేనిదే విగ్రహాలు ఏర్పాటు చేయరాదు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ .కె.కార్తీక్ ఐఏఎస్ అధ్యక్షతన సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వివిధ శాఖల అధికారులతో విగ్రహాల విషయమై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జీవో, ఎంఎస్ ,నంబర్ ,18 గురించి చర్చించి కొత్త విగ్రహాలు ఏవీ అనుమతించబడవు అని తెలిపారు.అదే విధముగా రోడ్లు మరియు బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల నిర్మాణం నిషేధించబడింది లేదు అంటే జిల్లా కలెక్టర్ లేదా కలెక్టర్ గారిచే నియమించబడ్డ విగ్రహాల కమిటీ నుండి ముందస్తు అనుమతి పొందాలి.ఏ ఇతర శాఖలకు కొత్త విగ్రహాలు అనుమతించుటకు అధికారాలు లేవు అని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా విగ్రహాలు ప్రతిష్టించిన యెడల వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు మరియు భవనాల శాఖ డివిజన్ ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ సంజీవయ్య డిఈ నాగరాజ్ పెనుకొండ,హిందూపురం మరియు మడకశిర మండలాల మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు మరియు పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img