Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

ప్రభుత్వ బాలికల పాఠశాలలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌

విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. పాఠశాల ఇన్చార్జ్‌ హెచ్‌ఎం వి పద్మజ ఆధ్వర్యంలో ఈ సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఎగ్జిబిషన్లో విద్యార్థులు పర్యావరణ రహిత వస్తువులు ఆరోగ్యం- శుభ్రత, పర్యావరణం- వాతావరణ మార్పులు అనే అంశాలపై వర్కింగ్‌ మోడల్స్‌ తయారు చేశారు. పాఠశాల కు చెందిన సైన్సు ఉపాధ్యాయుల పరిరక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img