Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

బాబా గుడి శాశ్వత అన్నదానముకు విరాళం.. ఆలయ అధ్యక్షులు సూర్య ప్రకాష్

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సాయి నగర్ లో గల శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది పేదలు, అనాధలు తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆలయ కమిటీ వారు చేస్తున్న సేవలను గుర్తించి, బంధం కృష్ణమూర్తి వారి కుటుంబ సభ్యులు శాశ్వత అన్నదానం రూ .20,500 లను ఆలయ కమిటీ వారికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక పూజలను చేయించి, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నారాయణరెడ్డి, హేమంతు, వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img