Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

ముగిసిన సంప్రోక్షణ వేడుకలు..

ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ చైర్మన్ సీరిపి పర్వతయ్య
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రముఖ మహిమగల శ్రీ దుర్గమ్మ దేవత దేవస్థానంలో ఈనెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు మూడు రోజులు పాటు సంప్రోక్షణ మహోత్సవ వేడుకలు ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సిరిపి పర్వతయ్య, దాతల, భక్తాదులు సహకారంతో నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు శనివారం రోజు దుర్గమ్మ తల్లిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, వివిధ ఆభరణాలతో అలంకరించి, ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. ఈ వేడుకకు ఆలయ కమిటీ వారు మేరకు తిరుమల తిరుపతి వేద పాఠశాల నుండి రామకృష్ణ శర్మ, పనింద్ర ,సురేష్, రవీంద్రనాథ్, నాగసాయి, లోకనాథ శర్మ, శ్రీ చంద్ర న్ లచే వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ, సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. తదుపరి అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, నూతన ముఖ తోరణంల ప్రారంభము, ప్రాకార రథమును ప్రారంభము, పూర్ణాహుతి,ఉస్మాండ బలి, బింబ దర్శనము ను అత్యంత వైభవంగా భక్తాదులు నడుమ అర్చకులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కి ఆలయ కమిటీ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి వారి పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు నాలుగు వేల మందికి పైగా భక్తాదులు పాల్గొన్నారు అని తెలిపారు. ఉభయ దాతలచే ఉదయం హోమాలు కూడా అర్చకులు నిర్వహించారు. ఆలయానికి రెండు వైపులా ఆలయ ముఖ తోరణం దాతలను, అమ్మవారి ప్రాకారోత్సవమునకు టేకుతో రథము చేయించిన సేవా కర్తలను, ముఖ్యమైన దాతలను కూడా ఆహ్వానించి, వారి పేరిటన ప్రత్యేక పూజలు తోపాటు ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగిన సంప్రోక్ష మహోత్సవ వేడుకలను ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన దాతలు, భక్తాదులకు పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు సాగా మురళి, గుర్రం రాధా, గుజ్జల నాగమ్మ, సాకే చౌడప్ప, నామ రాజశేఖర్ గుప్తా, బోయ నారాయణ, బోయ దుర్గ భవాని, పూజారి రామాంజనేయులు, ఆలయ మేనేజర్ రామశాస్త్రి వేలాదిమంది భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img