Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు

విశాలాంధ్ర/ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్‌ జి ఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగే వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెచ్‌ఎం శైలజ బుధవారం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బేస్బాల్‌ అండర్‌ 14 బాలుర విభాగంలో వి. పార్థసారథి అనే విద్యార్థి కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయిలో రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని, నెట్‌ బాల్‌ అండర్‌ 14 బాలుర విభాగంలో ఎం. కార్తీక్‌ నాయక్‌ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని, బాల్‌ బాడ్మింటన్‌ అండర్‌ 17 బాలుర విభాగంలో ఎం. పవన్‌ కుమార్‌ మదనపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని, అండర్‌- 14 బాలుర బాల్‌ బాడ్మింటన్‌ విభాగంలో యు. చిరంజీవి, బి. మహేష్‌ పొద్దుటూరులో ఈనెల 29 నుండి 31 వ తేదీ వరకు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థుల ఎంపిక పట్ల హెచ్‌ఎం తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు హేమలత, తులసి, శంకర నారాయణ, శ్రీనివాసులు, ప్రసాద్‌ బాబు, రామకృష్ణ, నాగరాజు, లీలావతి అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img