Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ పరిశీలన

విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ బుధవారం సందర్శించి జిల్లా వ్యాప్తంగా అమలవుతున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాల నూ పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. యుగంధర్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌ కి వివరించారు. జిల్లా లో నూతనంగా అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్‌ విధానం గురించి క్షుణ్ణంగా వివరించారు, గర్భవతుల కు బాలింతల కు అందుతున్న సేవలు మరియు తక్కువ బరువు తో పుట్టిన పిల్లల సంరక్షణ గురించి , రక్త హీనత నివారణ కోసం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. మాతా శిశు సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వివరించారు. క్షయ,కుష్టు, ఎయిడ్స్‌, మీద జిల్లా లో చేపడుతున్న అవగాహనా కార్యక్రమాల గురించి తెలిపారు. హెల్త్‌ మానేజ్మెంట్‌ సిస్టం , ప్రత్యుత్పత్తి ఆరోగ్య వ్యవస్థ గురించి తెలియ జేశారు. చిన్న పిల్లలకి అందిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహణ గురించి వివరించారు. క్లినికల్‌ ఆక్ట్‌, మరియు గర్భస్త పిండ లింగ నిర్ధారణ కమిటీ అమలు గురించి తెలిపారు.అదే విధంగా ఈ కార్యక్రమంలో హాజరైన జిల్లా ప్రోగ్రాం అధికారులు వారికి సంభందించిన ఆరోగ్య కార్యక్రమాలు అన్నిటినీ క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డా.సుజాత, డా.నారాయణ స్వామి, డా.మనోజ్‌, డా. అనుపమ జేమ్స్‌, డా. కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ప్రభాకర్‌ మోసెస్‌, మలేరియా అధికారి ఓబులు, మారుతి ప్రసాద్‌, కిషోర్‌,ఫణి, డిప్యూటీ డెమో త్యాగరాజు,వీరమ్మ, ఇందిర పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img