Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీలకు అవగాహన

విశాలాంధ్ర -పెనుకొండ: పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు శనివారం సబ్ కలెక్టర్ కార్తీక్ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసేటప్పుడు పోలింగ్ బూత్ లో వారు ఇచ్చే పెన్నులు మాత్రమే వాడాలని ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఒరిజినల్ గుర్తింపు కార్డులు ఒకటి తీసుకుని వెళ్లాలని ఓటు వేసేటప్పుడు ప్రిఫరెన్షియల్ ఓటు ప్రాధాన్యత ఓటు క్రమ పద్ధతిలో వేయాలని అలాగే పెనుకొండ మండలం నందు పట్టభద్రులు మొత్తం 16 60 మంది ఉన్నారు అలాగే ఉపాధ్యాయులు 96 ఓట్లు ఉన్నట్లు గుర్తించామని సబ్ కలెక్టర్ తెలిపారు వీరికి జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రాజకీయ పార్టీల నాయకులకు వారి యొక్క అనుచరులకు తెలియ చేయాల్సిన బాధ్యత ఉన్నదని బాధ్యత తీసుకొని రాజకీయ పార్టీలు అందరిని ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సువర్ణ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివశంకరప్ప నగర పంచాయతీ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ సబ్ కలెక్టర్ పరిపాలనాధికారి నాగరాజు వైయస్ఆర్సీపీ తరఫున మండల పరిషత్ అధ్యక్షులు గీతా రామ్మోహన్ రెడ్డి నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ ఫరూక్ ఖాన్ వైస్ చైర్మన్ సునీల్ కాంగ్రెస్ తరపున సిపిఐ సిపిఎం తరఫున ఇతర రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img