Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నియోజకవర్గంలో జగనన్న ఆణిముత్యాలు.. ఎంఈఓ సుధాకర్ నాయక్

విశాలాంధ్ర- ధర్మవరం : ఇటీవల పదవ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన మొదటి మూడు స్థానములు జగనన్న ఆణిముత్యాలుగా ఎంపిక కావడం జరిగిందని ఎంఈఓ సుధాకర్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించడం జరిగిందని, అందులో మొదటి బహుమతి.. ఏపీ మోడల్ స్కూల్.. జింక ఆదిశంకర్..586, బాలం సాయి ప్రసాద్..586, బి ఎస్ ఆర్ బాలుర ఉన్నత పాఠశాల, మదన మురళీకృష్ణ..586 మార్కులు.. ఏపీ మోడల్ స్కూల్ ధర్మవరం, ఇక రెండవ బహుమతిలో ఏపీ మోడల్ స్కూల్ ధర్మవరం.. కడపల కృష్ణ తులసి..585, మూడవ బహుమతిలో టి. మార్కులు మునిసిపల్ బాలికల ఉన్నత పాఠశాల.. కొత్తపేట ధర్మవరం. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి స్థానంలో నీరు గంటి లతా..971 మార్కులు.. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల-ధర్మవరం, హెచ్ ఇ సి గ్రూపులో మొదటి స్థానం సాకే మరెన్న..698 మార్కులు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల. ధర్మవరం. సీసీ గ్రూపులో మొదటి స్థానం గుజ్జల మౌనిక..902 మార్కులు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల- ధర్మవరం. తదుపరి బైపిసి గ్రూపులో మొదటి స్థానం పందెం వార్షిక-972 మార్కులు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల- ధర్మవరం. లలో ప్రతిభను కనపరచడం జరిగిందని వారు తెలిపారు. ఈ విద్యార్థులందరికీ ఈనెల 25వ తేదీన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు నగదు బహుమతి అందజేయబడునని వారు తెలిపారు. కావున విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆయా పాఠశాల, కళాశాలల, హెచ్ఎం లు, ప్రిన్సిపాల్ లు, టీచర్లు, అధ్యాపకులు పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img