Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మహిళల అభివృద్ధి ప్రభుత్వ యొక్క లక్ష్యం… ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం : మహిళల అభివృద్ధి ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని క్రీడా మైదానంలో ధర్మవరం మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో ఉన్న 1136 అర్హత కల సంఘాలకు గాను 10,663 సభ్యులకు మూడవ విడత వైయస్సార్ ఆసరా పథకం కింద 8 కోట్ల 94 లక్షల రూపాయలు మహిళల బ్యాంకు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆసరా పొందిన స్వశక్తి సంఘ సభ్యులచే వైయస్సార్ ఆసరా సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హాజరై, ప్రభుత్వం అందజేస్తున్న పలు సంక్షేమ పథకాలను వారు వివరించారు. ఆసరాకు చెందిన 8 కోట్ల 94 లక్షల రూపాయల మొత్తమునకు మెగా చెక్కును మెప్మా మహిళా సంఘ సభ్యులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రధానం చేశారు. అదేవిధంగా మెప్మా అర్బన్ మార్కెట్లో 16 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఆ స్టాలను కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి సందర్శించారు. అనంతరం మానస నృత్య కళామండలి వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, వైస్ చైర్మన్లు భాగ్యలక్ష్మి, పెనుజూరు నాగరాజు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, పట్టణ వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మెప్మా సిబ్బంది, టి పిఆర్ఓ,సిఎంఎం, తోపాటు సి ఓ ఎస్ లు కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img