Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

సాంకేతిక పరిజ్ఞానంతో మంచి, చెడులు కూడా ఉంటాయి.. ఆర్డీవో నాయక్ నాయక్

విశాలాంధ్ర – ధర్మవరం : నేడు సాంకేతికతతో సరికొత్త సేవలను ఉపయోగించడమే కాకుండా, దానివల్ల మేలు, కీడు కూడా జరుగుతున్నాయని ఆడియో తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రజలకు పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో అవగాహనతో ముందడుగు వేయాలని, 25 సంవత్సరాల క్రితమే అను పరీక్షను మనము విజయవంతంగా చేయడంతో పాటు ప్రపంచంలో కూడా గుర్తింపు పొందడం జరిగిందన్నారు. ఒకప్పుడు దేశ జనాభా 40 కోట్లు ఉండేదని నేడు 130 కోట్లకు పెరిగిన సాంకేతికత వల్ల పంటలు కూడా పండిస్తూ ఆహార భద్రతను కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. సాంకేతికతో మనము పూర్తిగా ఆధారపడటం మంచిది కాదని టెక్నాలజీని ఉపయోగించుకునే పద్ధతిలోనే మనము ఉంటే అభివృద్ధి అనేది జరుగుతుందన్నారు. సాంకేతికత అనేది వ్యక్తికి యాంత్రికంగా తయారు కావడం సరైన పద్ధతి కాదని తెలిపారు. అంతేకాకుండా డిజిటల్ పద్ధతిలో ప్రజలు నేడు ఉపయోగమును అధికంగా వినియోగించడం జరుగుతుందన్నారు. ఆనాడు రాజస్థాన్లోని ప్రోక్రాన్ లో ఆపరేషన్ శక్తి పేరిట భారత్ నిర్వహించిన అను పరీక్షలు ప్రపంచాన్ని నివరపరిచాయని తెలిపారు. సాంకేతిక వల్ల విద్యా, వైద్యం, రవాణా, సమాచార మార్పిడి, అంతరిక్ష పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో సాంకేతిక మార్పులు ప్రపంచ రూపురేఖల్ని సరవేగంగా మార్చి వేస్తున్నాయని తెలిపారు. మానవ నిత్య జీవన కార్యకలాపాలలో సౌలభ్యం పెరగడం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం జరుగుతుందన్నారు. ప్రతి మనిషి చెల్లింపుల వ్యవస్థలో ప్రస్తుతం మార్పు రావడం జరిగిందన్నారు. చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు వెంటనే నాకైతే చెల్లింపులు జరప వచ్చునని వారు తెలిపారు. మున్ముందు ఫైవ్ జి సాంకేతికతో సరికొత్త సేవలను ప్రజలకు అందుబాటులో కు వచ్చే సూచనలు కూడా ఉన్నాయని తెలిపారు. ఉత్పత్తి సేవా రంగాలలోనూ నూతన సాంకేతిక పరిజ్ఞానం విశేషంగా ప్రభావితం చేస్తోందని వారు తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనుషులు ప్రతి చిన్న పనికి టెక్నాలజీ పై ఆధారపడి, మెదడుకు శరీరానికి పని చెప్పడం మానేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానానికి తగిన పరిమితులను నిర్దేశించుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img