Friday, April 19, 2024
Friday, April 19, 2024

డాక్టర్లకు వైద్య విద్య బోధనలో మెరుగైన నాణ్యత శిక్షణకై మూడు రోజుల వర్క్ షాప్

జ్యోతి వెలిగించి ప్రారంభించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ మైరెడ్డి నీరజ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని అధ్యాపకులకు నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా కళాశాలలోని మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సవరించిన ప్రాథమిక వైద్య కోర్సు వర్క్ షాపును నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ మై రెడ్డి నీరజ మంగళవారం హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి విలువైన సూచనలు చేయడానికి మెరుగైన శిక్షణ ఇవ్వడానికి క్రిస్టియన్ మెడికల్ కళాశాల వెల్లూరు నుంచి జిరియాట్రిక్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సురేఖ పరిశీలకులుగా హాజరయ్యారు. మూడు రోజులపాటు ఎంపిక చేసిన 30 మంది వైద్య ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ 2019 మార్గనిర్దేశకత్వాల ప్రకారము నిర్వహిస్తారు. శిక్షణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అందరికీ శిక్షణ కార్యక్రమ పూర్తి పత్రమును అందిస్తారు. వైద్య విద్యార్థులకు మరింత మెరుగైన వైద్య విద్యను అందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని, వైద్య ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో కూడా ఈ శిక్షణ కార్యక్రమం అత్యంత కీలకమని తెలిపారు.మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ కోఆర్డినేటర్ ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా మాట్లాడుతూ మా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ మేడం గారి సూచనలతో, మార్గ నిర్దేశకత్వంలో మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ సభ్యుల సహకారంతో అత్యంత నాణ్యత ప్రమాణాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ సభ్యులు డాక్టర్ సంధ్య, డాక్టర్ భవాని, డాక్టర్ హైమావతి, డాక్టర్ పద్మ శ్రావణి, డాక్టర్ సుమన గోపీచంద్, డాక్టర్ శ్రావణి, డాక్టర్ అబ్దుల్ మజీద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img