Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆలిండియా సాఫ్ట్ బాల్ పోటీలకు శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపిక

విశాలాంధ్ర-గుంతకల్లు : ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ పోటీలకు శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ పి. గోపాల్ తెలిపారు.తమ కళాశాలకు చెందిన ప్రసన్నకుమార్ ,నల్లన్న, సురేష్ బాబు అనే విద్యార్థులు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాల పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. చండీగడ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో జరిగే ఏప్రిల్ 5 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల సాఫ్ట్ బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. క్రీడలతో శారీరక, మానసిక ,ఎదుగుదల ఉంటుందని ,ప్రతిభ గలిగిన క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడలు మానసిక ఆనందానికి శారీరక దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ఆల్ ఇండియా పోటీలలో చక్కని ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆయన కోరారు. అధ్యాపకులు బసెట్టి క్రిష్ణయ్య, డాక్టర్ పూజారి గోపి, పి శ్రీనివాసులు ,ఫిజికల్ డైరెక్టర్ భాషా అధ్యాపకులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img