Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : మండలంలోని ఉప్పుగుండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నాటి స్మృతులను నెమరు వేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. నాటి ఉపాధ్యాయులు లాలం పున్నయ్య, కె ఎస్ వి ప్రసాదరావు, పిడి సీతాదేవి, రవికాంత్ లను సన్మానించారు. నాడు వారు తమకు విద్యాబుద్ధులు నేర్పడంతోనే నేడు ఉన్నత స్థితిలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img