Friday, June 2, 2023
Friday, June 2, 2023

వేణుగోపాల స్వామి రథోత్సవం

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : ఉప్పుగుండూరు గ్రామంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక తెలగసంఘం ఆధ్వర్యంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు .భక్తులు పెద్ద ఎత్తున రథోత్సవంలో పాల్గొన్నారు. యువకులు ఉత్సాహంగా రథం లాగేందుకు పోటీపడ్డారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎస్సై ఉయ్యాల హరిబాబు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో మీనిశెట్టి శ్రీనివాసరావు, గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదాసు రాంబాబు, సొసైటీ అధ్యక్షులు ఉప్పుగుండూరు వాసు ప్రసాద్, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పేరాల చెన్నకేశవులు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు కొంజేటి సురేష్ బాబు, పెంట్యాల వెంకటేశ్వర్లు ,పెండ్యాల శ్రీనివాసరావు.,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img