Friday, April 19, 2024
Friday, April 19, 2024

నందవరంలో ఘనంగా అంబేద్కర్ 66వ వర్దంతి వేడుకలు

విశాలాంధ్ర : నందవరం మండలం నందవరం గ్రామంలో బస్టాండ్ కూడలియందు జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య ఆధ్వర్యంలో నందవరం మండల అధ్యక్షులు బుజ్జి బాబు అధ్యక్షతన మండల ఇన్చార్జి చింపిరి చిన్న పోతప్ప అధ్యక్షతన డాక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను సాధించాలని.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన నందవరంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం లేకపోవటం సిగ్గుచేటని ఇకనైనా ఇక్కడున్న అధికారులు నాయకులు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని తెలిపారు. ఆయన మాట్లాడారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి కర్రెన్న, ఎమ్మిగనూరు మండల అధ్యక్షులు పెద్ద ముష్టి అబ్రహం, సురేష్, నందవరం మండలం నాయకులు శవల భాస్కర్, సత్యానందం, గ్రామ అధ్యక్షులు మోజెస్, బండారు షెడ్రక్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img