Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సామాజిక సేవ కార్యకర్తలకు అవార్డులు

విశాలాంధ్ర :ఉరవకొండ : రెడ్ డ్రాప్ యువజన సేవా సమితి 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సమాజ సేవలో పనిచేస్తున్న ఉరవకొండ పట్టణానికి చెందిన నర్రా కేసన్న, మరియు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నిమ్మల వెంకటేశులుకు ప్రాణ దాత పురస్కార్ అవార్డులను అందజేసింది శుక్రవారం గుంతకల్లు పట్టణంలోనే రైల్వే ప్రాంగణంలో వైట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో సమాజ సేవ చేసిన వ్యక్తులను గుర్తించి అవార్డులను ప్రధానం చేశారు పట్టణానికి చెందిన నర్రా కేశన్న గత కొన్ని సంవత్సరాలుగా సొంత నిధులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు వైకుంఠ రథాన్ని కూడా ఏర్పాటు చేసి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించారు అలాగే ఎన్నో రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేసి ప్రాణ దాతగా నిలిచారు వైద్య ఆరోగ్య శాఖలో కార్యకర్తగా పనిచేస్తున్న వెంకటేష్ ఆపదలో ఉన్న వారి కోసం 30 సార్లు రక్తదానం చేసి ప్రాణ దాతగా నిలిచారు తల సేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయంలో రక్తదానం చేస్తూనే రక్తదానంపై కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలను కూడా ఈయన నిర్వహించారు వీరిద్దరి యొక్క సేవలను గుర్తించి రెడ్ డ్రాప్ యువజన సేవాసమితి ప్రాణదాతల అవార్డులను అందజేసి సత్కరించింది ఇలాంటి వ్యక్తులను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, డి.ఎస్.పి నర్సింగప్ప ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కాపు భారతి రోటరీ క్లబ్ గవర్నర్ వక్కల ఉమా తదితరులు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో రెడ్ డ్రాప్ పౌడర్ రహమాన్, ప్రెసిడెంట్ గులాబ్ మహమ్మద్, ప్రధాన కార్యదర్శి షఫీ, ఋషికేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img