Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

10 వేలు లంచం ఇస్తే బిల్లు మంజూరు చేస్తాం: గృహ నిర్మాణం అధికారులు

నిరసనకు దిగిన లబ్ధిదారులు

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ పట్టణం లక్ష్మీ నరసింహ కాలనీకి చెందిన చింత శేఖర్, యశోద దంపతులు వారు నివాసం ఉంటున్న శిథిలావస్థకు చేరుకున్న ఇంటిని తొలగించి ప్రభుత్వం ఇచ్చే బిల్లుతో కొత్త ఇల్లు నిర్మించుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు అధికారులు కూడా స్పందించి పాత ఇంటిని తొలగించి కొత్త ఇల్లు నిర్మించుకోవాలని గత సంవత్సరం ఏప్రిల్ లో ఐడి నెంబర్ నమోదు చేసి మంజూరు చేశారు దంపతులు తమ పాత ఇంటిని తొలగించి అప్పులు చేసి నిర్మాణం ప్రారంభించారు ఇల్లు నిర్మాణం పూర్తి అవుతున్నప్పటికీ కూడా గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇసుక,సిమెంటు బిల్లులు మంజూరు చేయకపోవడంతో గత నాలుగు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు ఈ విషయాన్ని గట్టిగా నిలదీయడంతో కేవలం ఇసుక మాత్రమే ఇచ్చి సిమెంటు, బిల్లులు మంజూరు చేయకుండా వేధించారు. పదివేల రూపాయలు లంచుమిస్తే మీ బిల్లులు మంజూరు చేస్తామని చెప్పడంతో లబ్ధిదారులు తాము డబ్బు ఇవ్వలేమని ఇప్పటికే అప్పుచేసి ఇల్లు నిర్మాణం ప్రారంభించామని చెప్పడంతో గృహ నిర్మాణ శాఖ అధికారులు మీ ఇంటి వెనక పాత గోడ ఉందని అందుకే బిల్లు మంజూరు చేయలేకపోతున్నామని కారణాలు చెప్పడంతో దంపతులు సోమవారం స్థానిక గృహ నిర్మాణ శాఖ కార్యాలయం ముందు నిరసనకు దిగారు తమకు న్యాయం జరిగే వరకూ కూడా పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు తమకు బిల్లులు మంజూరు చేయకపోతే ఆత్మహత్యలు శరణ్యమని పేర్కొన్నారు వీరి నిరసనకు అక్కడే ఉన్న గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారులు, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా స్పందించారు అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు కార్యాలయానికి తలుపులు వేసి నిరసన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img