Friday, June 2, 2023
Friday, June 2, 2023

బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేలా అసెంబ్లీ తీర్మానం హర్షనీయం…

గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి

విశాలాంధ్ర-గుంతకల్లు : ఎస్టీ జాబితాలో చేర్చాలని గత 70 ఏళ్లుగా పోరాటం చేస్తున్న బోయ/వాల్మీకులు ఎక్కువగా రాయలసీ ప్రాంతంలో కర్నూలు, అనంతపురం జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్నందున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షినీయమని గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని వాల్మీకి కళ్యాణ మండపం ఆవరణంలో పట్టణ వాల్మీకి సంఘం నాయకులు సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్య అతిథులు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ భవాని ,ఎంపీపీ బివి.మాదవి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గాదిలింగేశ్వర చిన్నబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ రామలింగప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ… 2019 ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తూ మేనిఫస్ట్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని ఇచ్చిన హామీని ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం వాల్మీకులందరికీ హర్షణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు చాముండేశ్వరి, మస్తానప్ప, ఎల్లప్ప ,సూర్యనారాయణ,మండల కన్వినర్ వాల్మికి మోహన్ ,రామంజినేయులు, వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img