Friday, June 2, 2023
Friday, June 2, 2023

నూతన సచివాలయ భవనం ప్రారంభం

విశాలాంధ్ర -ఉరవకొండ : మండలంలోని రాయంపల్లి గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని సోమవారం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అట్టడుగున ఉన్న పేద వర్గాలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థను తెచ్చారన్నారు.సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులు ఎంతో పాటు పడుతున్నారన్నారు.ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు సుజాత, ఇతర నాయకులు కార్యకర్తలు,గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img