Friday, April 26, 2024
Friday, April 26, 2024

లేపాక్షి నగర్ లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేరా..?

విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం రూరల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దశాబ్దం నుంచి ఉన్న లేపాక్షి నగర్, గేటెడ్ కమ్యూనికేటీ విల్లాస్ లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేరా అని సీపీఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ అధికారులపై మండిపడ్డారు. గురువారం ఆయా ప్రాంతాల్లో సీపీఐ నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ గత మూడు నెలలుగా వర్షపు కురుస్తున్న వర్షాలతో లేపాక్షి నగర్ లోని మొత్తం రోడ్లు జలమయమై, ఇళ్లలోకి నీరు వస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విల్లాస్ లో ఉన్న ప్రజలు దోమలతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అనంతరం అక్కడ నివాసమున్న ప్రజలను సమస్యలపై అడిగారు. పంచాయతీ డోర్ నెంబర్, ఇంటిపన్ను కూడా వసూలు చేయలేదన్నారు. గతంలో ప్రభుత్వ అధికారులకు, సమస్యలు చెప్పినా స్పందన లేదని వాపోయారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, లేపాక్షి నగర్ లో, రోడ్లపై నీరు రాకుండా, పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రజల పక్షాన సీపీఐ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సి.మల్లికార్జున, రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి పి.రామకృష్ణ, అనంతపురం నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగమయ్య, . రాప్తాడు నియోజకవర్గ సహాయ కార్యదర్శి సాకే నాగరాజు, అనంతపురం మండల కార్యదర్శి ఎం.రమేష్, అనంతపురం నగర సహాయ కార్యదర్శి అల్లిపీరా, మున్నా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img