Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

క్రీడాకారులకు క్రీడా సామాగ్రి అందవేత

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం జిల్లా క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని,శ్రీ సత్య సాయి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్నాథరెడ్డి ఆధ్వర్యంలో 25 హాక్ స్టిక్లు, నాలుగు గోల్ కీపర్ కిట్లు, 40 బాల్స్ లతోపాటు ఇతర క్రీడా సామాగ్రిని వారి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హాకీ క్రీడలకు ధర్మవరం మంచి పేరుగాంచిందని, పుట్టినిల్లు లాంటిదని తెలిపారు. అంతేకాకుండా ఈ హాకీ క్రీడల్లో మంచి ప్రతిభను రాణించి, జాతీయ స్థాయికి చేరుకోవాలని క్రీడాకారులకు వారు సూచించారు. ఈ కార్యక్రమములో హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు అనంతపురం జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి బంధనాదం సూర్య ప్రకాష్, శ్రీ సత్య సాయి జిల్లా హాకీ కోచ్ హసేన్, ధర్మాంబా హాకీ అసోసియేషన్ సహకార దర్శి జెన్నే చంద్రశేఖర్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img