Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఖోఖో క్రీడాకారులకు క్రీడా దుస్తుల వితరణ

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఖోఖో క్రీడాకారులకు వైసీపీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి గురువారం క్రీడా దుస్తులను వితరణ చేసి క్రీడాకారులను ఆశీర్వదించారు. చింతా సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ రాప్తాడు అంటే ఖోఖో, ఖోఖో అంటే రాప్తాడు అని జిల్లాలోనే మంచి పేరుతో ఖోఖో క్రీడకు పుట్టినిల్లుగా విరాజిల్లుతోందన్నారు. ఇదే పంథాను కొనసాగిస్తూ క్రీడాకారులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రీడలో ఎంతో మంది జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ సాధించి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిడి ఎన్. కేశవమూర్తి, ఖోఖో సీనియర్ క్రీడాకారుడు చిట్రా ఆదినారాయణ సోమశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img