Friday, April 19, 2024
Friday, April 19, 2024

పంటలు నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వండి

విశాలాంధ్ర-రాప్తాడు : గత నెలలో జిల్లాలో అధిక వర్షాల వల్ల అన్ని రకాలు పూర్తిగా రైతులు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని నష్టపరిహారం తక్షణమే మంజూరు చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. కాటమయ్య డిమాండ్ చేశారు. రాప్తాడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన వ్యక్తం చేసి ఆర్ఐ సునీతకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ వేరుశనగతోపాటు పండ్ల తోటలో కూరగాయల తోటలు పూర్తిగా తడిసి పోవడంతో పెట్టుబడులు కూడా రాలేదన్నారు కర్నూలు జిల్లాలో వ్యవసాయానికి గత ప్రభుత్వాలు డ్రిప్పు స్ప్లింకర్లు 90 శాతం సభ్యుడితో ఇచ్చేవారని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిలిపియడం దారుణం అన్నారు రైతుల ఆందోళనతో ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని అయితే సబ్సిడీ ఇస్తున్న ఈ పథకాలకు జీఎస్టీ విధించడం ఏమాత్రం సరికాదన్నారు తక్షణమే జీఎస్టీ తొలగించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చలపతి భాష మౌలాలి, శ్రీనివాసులు ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img