Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఎస్వీఐటీలో పీసీబీ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని హంపాపురం సమీపంలో ఉన్న ఎస్వీఐటీలో బుధవారం ఈసీఈ విభాగంలో పీసీబీ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ వర్క్ షాప్ ను నిర్వహించారు. ప్రిన్సిపల్ డా.టి.సూర్యశేఖర రెడ్డి గారు మట్లాడుతూ పీ సీ బీ సర్క్యూట్స్ ని సొంతంగా తయారు చేసుకునే విధానాన్ని నేర్పించామని, ఇలాంటి వర్క్ షాప్స్ వల్ల విద్యార్థులతో నూతన టెక్నాలజీలపై అవగాహన పెంపొందిచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ వీ.బీ.ఆర్.శర్మ, చైర్మన్ బీ.వీ.క్రిష్ణారెడ్డి, వైస్ చైర్మన్ వెన్నపూస రవీంద్రరెడ్డి, సీ.ఈ.ఓ ఆనంద్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డా. ఎన్.ఏ.వీ ప్రసాద్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img