Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

క్షేత్రస్థాయిలో పొలాల్లో ఆర్డీఓ పరిశీలన

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని మరూరు గ్రామంలో క్షేత్రస్థాయిలోని పొలాల్లో ఆర్డీఓ  మధుసూదన్ బుధవారం పరిశీలించారు. మరూరు గ్రామంలో  278-4 సర్వే నంబరులో రైతు భరోసా కేంద్రానికి కేటాయించిన భూమిలో హైకోర్టులో ఉన్నందున త్వరితగతిన కేసు పూర్తి చేసి గోడను నిర్మిస్తామన్నారు. అదే గ్రామంలో 1094 సర్వే నంబరులో రస్తా వివాదాన్నీ పరిశీలించారు. రాప్తాడు గ్రామ పొలం 614 సర్వే నంబరులో 0.33 సెంట్ల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడానికి వచ్చిన దరఖాస్తుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాప్తాడు మండలంలో ఎటువంటి భూమి వివాదాలు లేకుండా పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీటీ నరసింహ, సర్చేయర్ రామాంజనేయులు, వీఆర్ఓ రవి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img