Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయండి

గ్రామ సర్పంచుల విజ్ఞప్తి

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మండలం రాకెట్ల,ఆమిద్యాల,మోపిడి,లత్తవరం గ్రామాలలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఆ గ్రామాల సర్పంచులు బుధవారం విద్యుత్ శాఖ ఏడి గురురాజును కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ గతంలో ఎప్పుడో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలుగా. శిథిలావస్తుకు చేరుకున్న వాటిని తొలగించి కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ గ్రామాల సర్పంచులు దెయ్యాల శివమ్మ,,శ్రీరాములు,సిద్ధార్థ,వంశీకృష్ణ వైసిపి నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img