Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

సొంత ప్రాంత అభివృద్దే లక్ష్యం

. నిరుద్యోగ యువత ఉపాధి ముఖ్య ఉద్దేశం
. పరిశ్రమల స్థాపనతోనే దుర్గం అభివృద్ధి
. పారిశ్రామికవేత్త జీ.కే కృ ష్ణమూర్తి వెల్లడి

విశాలాంధ్ర – కళ్యాణదుర్గం టౌన్ : పుట్టి పెరిగి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నానని పారిశ్రామికవేత్త జీకే కృష్ణమూర్తి వెల్లడించారు. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలోని ఆరాధ్య దైవమైన అక్కమాంబ ఆలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులతో కళ్యాణదుర్గం ప్రాంతా అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నానని అన్నారు .మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి అభివృద్ధి లో కనీసం కొంతైనా చేసి వెనుకబడిన ప్రాంత రుణం తీర్చుకోవాలని దృఢ సంకల్పంతో అమ్మవారి ఆశీస్సులతో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పం ఉందన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ యువకులు వేలాది మంది ఉన్నారని నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా చూడాలన్న లక్ష్యంతో పరిశ్రమకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగానే గోళ్ళ, బోరంపల్లి, నూతిమడుగు, పరిసర ప్రాంతాలలో వందల ఎకరాలలో భూమిని పరిశ్రమ కోసం అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది నిపుణుల పరిశీలనలో తేలాల్సి ఉందని ఇందులో భాగంగా డిసెంబర్ 6 వ తారీఖున నిపుణుల బృందం ఆయా ప్రాంతాలను పరిశీలించేందుకు వస్తుందన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కొన్ని సంవత్సరాలు నుంచి కులమత బేధాలకు తావివ్వకుండా ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుని వారి వారికి తగినట్టుగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేశామన్నారు. కరువు పీడిత ప్రాంతమైన దుర్గంలో ఎంతో అవసరమని వారి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇతర దేశ రాష్ట్ర పారిశ్రామిక వెతల సహాయ సహకారాలతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది కుటుంబాల వెలుగుల నింపాలనేదే నా ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇందుకు రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజల రాజకీయ పార్టీలకు అతీతంగా సహకరిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అమ్మవారి ఆశీస్సులతో పాటు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎంతో అవసరమని మీ ఆశీస్సులు తప్పక ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గోళ్ళ సర్పంచ్ కవితా బొజ్జన్న, జీకే యువసేన వీరేష్ యాదవ్ ఆర్కే రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img