Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

చేనేత కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి రమేష్

అభివృద్ధి అధికారి రమణారెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని చేనేత కార్మికులు అందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తప్పక అవగాహన చేసుకుని, సద్వినియోగం చేసుకుంటే జీవనోపాధి సుఖవంతమవుతుందని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి రమేష్, అభివృద్ధి అధికారి రమణ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని సాయి నగర్ పరిధిలోని సచివాలయంలో చేనేత కార్మికులకు ముద్ర పథకం కింద అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చేనేత కార్మికులకు ముద్ర పథకం, చేనేత పెన్షన్లు నేతన్న నేస్తం ఇతర ప్రభుత్వ పథకాల గూర్చి వారు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ముద్రణ లోను ద్వారా బ్యాంకుల్లో రుణాలు తీసుకొని సకాలంలో వాయిదాలు చెల్లిస్తూ, జీవన అభివృద్ధి చక్కగా ఉంటుందని తెలియజేశారు. పట్టణంలో పవర్ లూమ్స్ పై దాడులు నిర్వహిస్తూ కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నామని, 11 రకాల చేనేత రిజర్వేషన్ చట్టం ను మరమగాల్లో లేకుండా చూస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులకు పని కల్పించడమే మా ధ్యేయమని, పని లేని వారు మాతో సంప్రదించాలని వారు తెలిపారు. అన్ని వర్గాల వారికి నేడు చేనేత పరిశ్రమ జీవనోపాధిని కల్పించడం శుభదాయకమన్నారు. అపూహలుమాని చేనేతలు నమ్ముకున్న మగ్గాలతో, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మెరుగైన జీవన విధానమును అలవర్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుమార స్వామి తో పాటు అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img