Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆత్మహత్య చేసుకున్న ఘటనలో భర్త అరెస్టు

పరాయి మహిళతో వివాహిత సంబంధమే ఆత్మహత్య కారణం
డిఎస్పీ శ్రీనివాసులు

విశాలాంధ్రబ్యూరోఅనంతపురం: ఇద్దరు పిల్లల సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో భర్త అరెస్టు చేసినట్లు డిఎస్పీశ్రీనివాసులు పేర్కొన్నారు.
పరాయి స్త్రీతో భర్త వివాహేతర సంబంధం కొనసాగించడం, తరుచూ కొట్టడం, నిర్లక్ష్యం చేయడంతోనే ముగ్గురి చెరువులో ఆత్మహత్యచేసుకోవడం జరిగిందని,ఆత్మహత్య కు గకారణలను వివరించారు.శింగనమల చెరువులో రెండ్రోజుల కిందట వెలుగు చూసిన ఇద్దరి పిల్లల సహా తల్లి ఆత్మహత్య ఘటనలో ఆమె భర్త బండారు రామాంజినేయులును పోలీసులు అరెస్టు చేశారు. పరాయి స్త్రీతో భర్త వివాహేతర సంబంధం కొనసాగించడం, తరుచూ కొట్టడం, నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, శింగనమల సి.ఐ అస్రార్ బాషాతో కలిసి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
పామిడి మండలం ఎదురూరుకు చెందిన కవిత కు … పెద్దవడుగురు మండలం కిష్టపాడు గ్రామానికి చెందిన బండారు రామాంజనేయులు కు 2011 సంవత్సరంలో వివాహమయ్యింది. వీరికి సంతోష్ ( 8 సం.లు), భార్గవి ( 4 సం.లు) సంతానము ఉన్నారు. బతుకు తెరువు కోసం సుమారు 10 నెలల కిందట రామాంజనేయులు తన భార్యాపిల్లలతో పాటు తాడిపత్రి పట్టణానికి వెళ్లాడు. అక్కడ ఓ గుజిరి వ్యాపారి వద్ద పనికి వెళ్లేవాడు. ఈక్రమంలో బండారు రామాంజినేయులు పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని తన భార్య కవిత పిల్లలు సంతోష్ భార్గవి లను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. నిర్లక్ష్యం చేస్తూ వారి ఎదురు తిరిగితే నిత్యము కొట్టేవాడు. ఈనెల 18 వ తేదీ రాత్రి కూడా భార్య, ఇద్దరు పిల్లలను కొట్టాడు. ఈ బాధలు భరించలేక ఈనెల 19 న భర్త పనికి వెళ్లాక తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని శింగనమల చెరువు వద్దకు చేరుకుంది. అదే రోజు తన ఇద్దరు పిల్లలు సహా ఆమె ఆత్మహత్య చేసుకుంది. మరుసటి రోజు ఈ ముగ్గురు శవాలుగా చెరువులో కన్పించారు. సంచలనం రేకెత్తించిన ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సి.ఐ అస్రార్ బాషా, ఎస్సై వంశీకృష్ణలు తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఈ మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. ఈ ఘటన ఛేదింపు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అంతేకాకుండా… ముగ్గురి ఫోటోలు మరియు ఆమె చేతిపై రాసిన పచ్చబొట్టు స్పష్టంగా కన్పించేలా పోటోలను మీడియా, ఇతర గ్రూపుల్లో షేర్ చేశారు. ఈనేపథ్యంలో ముగ్గురి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో భాగంగా సి.ఐ అస్రార్ బాషా, ఎస్సై వంశీకృష్ణలకు రాబడిన సమాచారంతో తాడిపత్రి పట్టణంలోని పోతులయ్యపాలెంలో ఉన్న బండారు రామాంజినేయులను అరెస్టు చేశామని డీఎస్పీ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img