Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కోటి ఏడు లక్షల మద్యం ధ్వంసం

విశాలాంధ్ర – కోడుమూరు : అడిషనల్ ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డి ప్రసాద్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ రాజశేఖర్ ల ఆధ్వర్యంలో కోడుమూరు నుండి లింగందిన్నె వెళ్ళే రోడ్డులో భారీస్థాయిలో కోటి ఏడు లక్షల రూపాయలు విలువైన మద్యం బాటిల్స్ లను సెబ్ అధికారులు ధ్వంసం చేయించారు.శనివారం మధ్యాహ్నం కోడుమూరు చేరుకున్న సెబ్ అధికారులు కోడుమూరు-లింగందిన్నె రహదారిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలోని కర్నూలు,కోడుమూరు, ఎమ్మిగనూరు స్టేషన్ల పరిధిలలోని గత మూడు సంవత్సరాల నుండి వివిధ కేసులలో పట్టుబడిన తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యం బాటిల్స్ ను రోడ్డురోలర్,డోజర్ లతో కూలీల సహాయంతో రోడ్డు పైన రోడ్డు పొడుగునా పేర్చి వాటిని ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా సెబ్ అడిషనల్ ఎస్పి ప్రసాద్ మాట్లాడుతూ కర్నూలు తోపాటు కోడుమూరు,ఎమ్మిగనూరు సెబ్ స్టేషన్ల పరిధిలోని తెలంగాణ కర్నాటక రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుకున్న మొత్తం 643 బాక్సులలోని 96645 మద్యం సీసాలు,టెట్రా ప్యాకెట్లను ధ్వంసం చేయించినట్లు వివరించారు.కర్నూల్ సెబ్ స్టేషన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రసాద్రావు,కోడుమూరు సెబ్ సిఐ శ్యాంప్రసాద్,ఎస్ఐ సునీల్ కుమార్,ఎమ్మిగనూరు సెబ్ సిఐ జయరామనాయుడు,ఎస్ఐ సోమశేఖరరావు,వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img