Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

సభను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర నాయకులు రామాంజనేయులు
నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు

విశాలాంధ్ర. నందికొట్కూరు : రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర నాయకులు రామాంజనేయులు అన్నారు. శనివారం నందికొట్కూరు పట్టణంలోని జై కిసాన్ పార్క్ నందు సిపిఐ మహాసభలు ఏర్పాటు చేశారు. ఈ మహాసభలకు రాష్ట్ర నాయకులు రామాంజనేయులు సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు రఘురాం మూర్తి లు హాజరు కావడం జరిగింది . ముందుగా పట్టణంలోని స్థానిక సిపిఐ కార్యాలయం నుంచి ప్రజానాట్యమండలి కళాకారులతో డప్పులతో ర్యాలీగా వచ్చి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం ఏఐటీయూసీ కార్యాలయం వద్ద జండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ర్యాలీ పటేల్ సెంటర్ మీదుగా జై కిసాన్ పార్కు సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. ఈ సభకు సిపిఐ తాలూకా ఉపాధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా మళ్ళీ పడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నిత్యవసర వస్తువుల ధరలపై జిఎస్టి విధించడం వల్ల సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని పథకాల పేరుతో అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ పాలకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి రోజులు దగ్గరపడ్డాయన్నారు. అదేవిధంగా నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు నరేంద్ర మోడీ నేను యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వక యువతను మోసం చేస్తూ మరియు డీజల్ ,గ్యాస్, పెట్రోల్, వంట నూనెలు విపరీతంగా పెంచి ప్రజలపై భారాలు వేయడం జరిగిందన్నారు. మత విద్వేషాలతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ల మధ్య చిచ్చు పెడుతూ పరిపాలన కొనసాగిస్తున్నారని వారికి వ్యతిరేకంగా ముస్లింలు, క్రిస్టియన్లు పోరాటాలు చేస్తే వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. నందికొట్కూరు ప్రాంతం చుట్టూ నీరు ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజానీకానికి సాగు, త్రాగు నీరు అందించడంలో పాలకులు పూర్తిగా విఫలం చెందారన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడి ప్రజలకు సాగు, త్రాగునీరుతో పాటు మిడుతూరు మండలానికి హంద్రీనీవా ద్వారా ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలన్నారు. లేదంటే సిపిఐ పార్టీగా ఎత్తిపోతల పథకం సాధించేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై ఎండగట్టేందుకు ఈనెల 30వ తేదీన నంద్యాల జిల్లా మహాసభలలో నంద్యాల పట్టణంలో ఐదువేల మందితో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. కాబట్టి 30, 31 తేదీల్లో జరిగే జిల్లా మాసములకు పెద్ద ఎత్తున ప్రజలు కదలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంగర శ్రీనివాసులు ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, ధనుంజయుడు, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు శేషన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మహానంది, దినేష్ ప్రజానాట్యమండలి సభ్యులు కార్యకర్తలు , పార్టీ సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img