విశాలాంధ్ర-శెట్టూరు : మండల పరిధిలో మా కొడికి ఉన్నత పాఠశాల నందు హిందీ ఉపాధ్యాయుడు పనిచేస్తున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆదుకున్నారు. వివరాల్లోకెళ్తే. కుందుర్పి మండల కేంద్రానికి చెందిన శాంతరాజు హృదయ సంబంధిత వ్యాధితో నెలరోజుల క్రితం ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ శాంతరాజు ఆరోగ్యం విషమంగా ఉన్నది నిరంతరం ఆయాసం బాధపడుతూ ఉండేవాడు మందులు వాడిన కూడా ప్రయోజనం లేకపోయింది కళ్యాణదుర్గంలో హాస్పిటల్ చూపించుకునిగా బెంగళూరులో ఆపరేషన్ చేయించుకున్న డాక్టర్లు సూచించారు శాంతారాజ్ కుటుంబం వద్ద వైద్యానికి డబ్బులు కుటుంబ సభ్యులందరూ నిస్తాయ స్థితిలో ఉండిపోయారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న శాంతరాజు ఆరోగ్యం గురించి బంధువులు స్నేహితుల ద్వారా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ బద్దేనాయక్ కు తెలపగా రాత్రికి రాత్రే బెంగళూరు పంపించి చికిత్సకు అవసరమైన ₹20 వేలు రూపాయలను శాంతరాజు చెల్లెలు అరుణ కు పాఠశాల విరామ సమయంలో ఆర్థిక సహాయాన్ని అందించాడు ప్రాణాపాయలసితి నుంచి కాపాడినందుకు ఉపాధ్యాయ బృందానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు భాస్కర్, చిరంజీవి ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు