Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైభవంగా కసాపురం రథోత్సవం

విశాలాంధ్ర-గుంతకల్లు : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో గురువారం శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రారంభమైన రథోత్సవ వేడుకలను బుదువారం నుండి ప్రారంభం కాగా గురువారం స్వామి వారి రథోత్సవం జరిగింది. ఉదయం ఆలయంలోని మూలవిరాట్ ఆంజనేయస్వామికి తెల్లవారుజామున సుప్రభాత సేవలో బాగంగా స్వామి వారికి మహాభిషేకం, విశేష పుష్పార్చనలు, అలంకారాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు, వజ్రకవచాలంకరణ, బంగారు కిరీటధారణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామి వారికి మహానివేదన, మద్యాహ్నం మహామంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. సాయంకాలం ఆలయంలోని శ్రీసీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువుదీర్చి గోవింద, రామ నామస్మరణలతో స్వామి వారిని ఆలయ రాజగోపురం వరకు తీసుకువచ్చారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్ద విశేష పుష్పాలు, పచ్చటి తోరణాలతో రంగురంగుల విద్యుదీపాలతో అలంకరించిన రథోత్సవంలో స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను కొలువు దీర్చారు. ఈ సందర్భంగా స్వామి వారి రధోత్సవానికి ఆలయ వేదపండితులు రథాంగ హోమం, బలిహరణ పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి, ఆలయ ఇఓ వెంకటేశ్వరరెడ్ది, ఆలయ ట్రస్ట్ బోర్డు అధ్యక్షురాలు సుగుణమ్మ, ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యులు,ప్రదాణ అర్చకులు గరూడాచార్యులు,రాగావాచార్యులు,అంతచార్యులు,తో పాటు పలువురు పుర ప్రముఖులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. హర నామస్మరణలతో గోవింద, రామ నామస్మరణలతో రథాన్ని లాగారు. ఆలయ రాజగోపురం వద్ద నుండి ప్రారంభమైన రథోత్సవం రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాలతో గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా రథంలోనిస్వామి వారి దర్శనార్థం భక్తులు పెద్దఎత్తున బారులు తీరారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ డిఎస్ పి నరసింగప్ప ఆదేశాలతో కసాపురం ఎస్సై గోపాలుడు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img