Friday, April 26, 2024
Friday, April 26, 2024

కురుబల ను సంచార కులంగా గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చాలి

కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన కురబ సంఘం నాయకులు

విశాలాంధ్ర- ఉరవకొండ : ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో కూడా వెనుకబడిన కురుబ మరియు కురుమ కులస్తులను సంచార కులంగా గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చాలని మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టి అనంతరం ఆంధ్ర భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించినట్లు ఉరవకొండ నియోజకవర్గం కురుబ సంఘం యువజన విభాగం నాయకులు వసికేరి మల్లికార్జున తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ సూర్య ప్రకాష్ బాబు, రాష్ట్ర కురుబ సంఘం యువజన విభాగం అధ్యక్షులు వసికేరి రమేష్ బాబు, ఈశ్వరయ్య, విఠల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుబక్కులస్తులు యొక్క వెనుకబాటుతనాన్ని కేంద్ర మంత్రి రాందాస్ అథవలేకు వివరిస్తూ వినతి పత్రాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. గొర్రెలు మేకలు మేపుతూ వృత్తిగా జీవిస్తున్న కురువ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్లు వారు తెలిపారు. రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ తదితర అన్ని రంగాల్లో కూడా కురుబ కులస్తులు వెనుకబడి ఉన్నారని ఎస్టీ జాబితాలో చేరిస్తే కురుబలు అన్ని రంగాల్లో కూడా ముందుంటారని కేంద్ర మంత్రులకి వివరించినట్లు వారి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు బ్యాల నాగేంద్ర, పటాస్ శ్రీకాంత్, చిట్రా శ్రీనివాసులు, బండిసాయి, కప్పల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img